close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 16/03/2020 21:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐపీఎల్‌ శిక్షణ శిబిరాలు వాయిదా

ముంబయి: కరోనా వైరస్‌ ముప్పుతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సాధనా శిబిరాలన్నీ ఖాళీ అయ్యాయి. అన్ని ఫ్రాంచైజీలు తమ శిబిరాలను రద్దు/వాయిదా వేస్తున్నామని ప్రకటించాయి. తిరిగి పిలుపునిచ్చేంత వరకు ఆటగాళ్లెవరూ రానవసరం లేదని వెల్లడించాయి. ఇప్పటికే ఐపీఎల్‌ను మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 15కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తమ సాధనా శిబిరాన్ని రద్దు చేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం వారి శిబిరం మార్చి 21న ఆరంభం కావాల్సి ఉంది. ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తమ శిబిరాలను ఇప్పటికే రద్దు చేశాయి.

‘ప్రతి ఒక్కరి ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మార్చి 21న ఆరంభం కావాల్సిన ఆర్‌సీబీ శిక్షణ శిబిరాన్ని వాయిదా వేస్తున్నాం. మరోసారి నోటీసు ఇచ్చేంత వరకు ఆటగాళ్లెవరూ రానవసరం లేదు. అందరూ ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించాలని కోరుతున్నాం’ అని ఆర్‌సీబీ ట్వీట్‌ చేసింది. చెన్నై శనివారమే శిబిరాన్ని రద్దు చేసింది. ఆ జట్టు సారథి ధోనీ వెంటనే చెన్నై నగరాన్ని వీడాడు. ప్రపంచ వ్యాప్తంగా 1,60,000 మందికి కొవిడ్‌-19 సోకగా 6000 కన్నా ఎక్కువ మంది మృతిచెందారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.