close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 27/05/2020 00:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాహుల్‌ ఆరోపణలు సరికావు: జావడేకర్

దిల్లీ: దేశం మొత్తం కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం కరోనాను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌ ఆరోపించారు. మంగళవారం వార్తా సంస్థలతో రాహుల్ గాంధీ నిర్వహించిన కార్యక్రమం అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. కరోనా కట్టడికి కేంద్రం విధించిన లాక్‌డౌన్ విఫలమైందని రాహుల్ కేంద్రంపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేశారు.

‘‘ఆయన తప్పుడు ప్రకటనలు చేస్తారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి ఒక విషయం చెప్పదల్చుకున్నాను. మొదటిసారి లాక్‌డౌన్‌ విధించినప్పుడు కరోనా వైరస్‌ వ్యాప్తి మూడురోజులకు ఒకసారి రెట్టింపు అయ్యే దశలో ఉంది. ప్రస్తతం వైరస్‌ వ్యాప్తి పదమూడు రోజులకు ఒకసారి రెట్టింపు అవుతోంది. ఇది భారత్ సాధించిన విజయం. అలానే ఇది ప్రతి ఒక్కరి గెలుపు కూడా’’ అని జావడేకర్ తెలిపారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రపంచ దేశాలు అభినందిస్తుంటే, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం కేంద్రంపై విమర్శలు చేస్తుందని అన్నారు. తొలిసారి లాక్‌డౌన్‌ విధించినప్పుడు, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తంచేసిన కాంగ్రెస్‌, లాక్‌డౌన్ సడలింపులను వ్యతిరేకించడం ఆ పార్టీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని జావడేకర్‌ పేర్కొన్నారు.

అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్, స్పెయిన్‌, ఇటలీ, ఇరాన్‌, బ్రెజిల్, చైనాలలో కరోనా కారణంగా జరిగిన నష్టంతో పోలిస్తే భారత్‌ చాలా తక్కువ ప్రభావితమైందని అన్నారు. సరైన సమయంలో లాక్‌డౌన్ అమలు చేసినందుకు ప్రంపంచదేశాలు భారత్‌ను అభినందించాయని తెలిపారు. వలస కార్మికుల తరలింపులో కేంద్రం విఫలమైందన్న కాంగ్రెస్‌ ఆరోపణలకు ఆయన ధీటుగా బదులిచ్చారు. సుమారు మూడు లక్షల మంది వలస కార్మికులను మూడువేల  ప్రత్యేక రైళ్లలో సురక్షితంగా వారి ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. రేషన్‌ కార్డు లేని వలస కూలీలకు కూడా ఉచితంగా సరుకులు అందించామని మంత్రి వెల్లడించారు.  


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.