close

తాజా వార్తలు

Updated : 14/01/2021 14:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యవసాయ బావిలోంచి తప్పించుకున్న చిరుత 

బోయినపల్లి : వ్యవసాయ బావిలో పడిన చిరుత ఎట్టకేలకు తప్పించుకుంది. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కోరెపు సురేశ్‌ తన వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు  బుధవారం ఉదయం వెళ్లాడు. బావిలో చిరుత కనబడటంతో గ్రామస్థులకు సమాచారం అందించాడు. పెద్ద సంఖ్యలో జనం వ్యవసాయ బావి వద్దకు చేరుకుకోవడంతో ఆ అలికిడి విన్న చిరుత బావిలోని ఓ బండరాయి కిందకు వెళ్లింది. సమాచారం అందుకున్న సిరిసిల్ల ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌రావు, సెక్షన్‌ అధికారి సౌమ్య బావివద్దకు చేరుకొని స్థానికులను అక్కడినుంచి దూరంగా పంపించారు. అధికారులు చిరుతపులిగా నిర్ధారించి హైదరాబాద్‌ రెస్క్యూ బృందానికి సమాచారం ఇచ్చారు. 

వారు రావడం ఆలస్యం కావడంతో చీకటి పడ్డాక బావిలోకి నిచ్చెన, తాళ్లను వేశారు.  బావివద్ద రెస్క్యూ బృందం సీసీ కెమెరాలను బిగిం, బోను ఏర్పాటు చేసింది. వలవేసి చిరుతను బంధించాలనుకున్నా సాధ్యపడలేదు. రాత్రివేళ చిరుత బయటకు వస్తే పట్టుకోవాలని పథకం వేశారు. అందుకోసం నిచ్చెన కూడా ఏర్పాటు చేశారు. కానీ, సిబ్బంది ఉదయం సిబ్బంది వచ్చే సరికి బావిలోంచి చిరుత వెళ్లిపోయింది. నీటిలో పడి చిరుత చనిపోయిందా, బావిలోంచి వెళ్లిపోయిందా అని నిర్థరించుకునేందుకు అటవీ సిబ్బంది పొక్లెన్‌ సాయంతో బావిలోకి ఓ వ్యక్తిని దించారు. బావిలో చిరుత కనిపించకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిందని నిర్థారించుకున్నారు. సమీప గుట్టల నుంచి చిరుత వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో చిరుత ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు కళ్లారా చూడటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత ఎటువైపు వెళ్లిందనే దానిపై ఇంకా అధికారులు నిర్థరణకు రాలేదు.

ఇవీ చదవండి..
మళ్లీ మూలాల్లోకి!

ట్రంప్‌ అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం
 




Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని