close

తాజా వార్తలు

Published : 07/03/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ నటి అనుపమ పరమేశ్వరన్‌, టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా ప్రేమలో మునిగిపోయారని, త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని కొన్ని రోజులుగా సోషల్‌ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవన్నీ వట్టి పుకార్లేనని అనుపమ తల్లి సునీత పరమేశ్వరన్‌ కొట్టిపారేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె వారిద్దరూ ప్రేమలో ఉన్నారనేది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అయితే అనుపమ తండ్రి క్రికెట్‌కు వీరాభిమాని అని, అందుకే ఒక సందర్భంలో బుమ్రాను కలుసుకున్నారే తప్ప అందులో మరే ఉద్దేశమూ లేదని స్పష్టతనిచ్చారు. ఆ సమయంలో షూటింగ్‌ కోసం బుమ్రా ఉన్న హోటల్లోనే అనుపమ బస చేయాల్సి రావడంతో ఈ ఊహాగానాలు పుట్టుకొచ్చాయి.

ఈ ఊహాగానాలను తమ కుటుంబం అంత సీరియస్‌గా తీసుకోవట్లేదని అనుపమ తల్లి తెలిపారు. ఇంగ్లాండ్‌తో చివరి టెస్ట్‌ మ్యాచ్‌ నుంచి బుమ్రా తప్పుకోవడంతో సోషల్‌ మీడియాలో ఈ పెళ్లి వదంతులు మొదలయ్యాయి. మొత్తానికి అనుపమ విషయంలో ఆమె తల్లి పూర్తి స్పష్టతచ్చింది. మరోవైపు బుమ్రాతో స్టార్‌ స్పోర్ట్స్ యాంకర్‌ సంజన గణేశన్‌ ఏడడుగులు వేయబోతుందని మరో ప్రచారం మొదలైంది. ఈ వార్తలోనైనా నిజం ఉందా? లేదా? అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇవీ చదవండి


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని