
తాజా వార్తలు
అభిశంసన ఉత్తర్వులు తిప్పి పంపిన ప్రభుత్వం
అమరావతి: ఏపీ పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) జారీ చేసిన అభిశంసన ఉత్తర్వులు (సెన్సూర్ ప్రొసీడింగ్స్)ను రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీకి తిప్పి పంపింది. ఐఏఎస్‌లపై ప్రొసీడింగ్స్ జారీ చేసే అధికారం ఎస్ఈసీకి లేదని ప్రభుత్వం పేర్కొంది. వివరణ కోరకుండా ప్రొసీడింగ్స్ జారీ చేయలేరని స్పష్టం చేసింది.
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ద్వివేది, గిరిజా శంకర్‌పై ప్రొసీడింగ్స్ జారీ చేసిన ఎన్నికల సంఘం.. సర్వీసు రికార్డుల్లో రిమార్కులను నమోదు చేయాలని ఆదేశించింది. అధికారులపై జారీ చేసిన అభిశంసన ప్రొసీడింగ్స్‌ను కేంద్ర సిబ్బంది, వ్యవహారాల శాఖకు పంపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ ఎస్ఈసీ ఆదేశాలను తిప్పి పంపింది.
ఇవీ చదవండి..
ద్వివేది, గిరిజా శంకర్ల అభిశంసన
అనేక అవమానాలు ఎదుర్కొంటున్నా: ఆనం