ఎనిమిదిమందిని కాల్చి చంపాల్సింది..
close

తాజా వార్తలు

Published : 13/04/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎనిమిదిమందిని కాల్చి చంపాల్సింది..

బెంగాల్‌లో భాజపా నేత వివాదాస్పద వ్యాఖ్యలు

కోల్‌కతా: పశ్చిమ్ బెంగాల్‌లో నాలుగోదశ అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలు కాల్పులకు దారితీయగా..ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కోచ్‌బిహార్‌లోని సీతల్‌కుచిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై తాజాగా భాజపా నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కేంద్ర బలగాలు నలుగురిని కాదు..ఎనిమిది మందిని కాల్చివేసి ఉండాల్సిందంటూ తాజాగా భాజపా నేత రాహుల్ సిన్హా వ్యాఖ్యలు చేశారు. 

రాహల్‌ సిన్హా  ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. ‘నలుగుర్ని కాదు. ఎనిమిది మందిని భద్రతా బలగాలు కాల్చివేసి ఉండాల్సింది. ప్రజలు ఓటు వేయకుండా కుట్రచేయడంలో మమతకు సాటిలేరు. అందుకే దీదీ టైం ముగిసింది. గూండాలతో ప్రజాస్వామ్య హక్కులను హరించడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి సీతల్‌కుచిలో తగిన సమాధానం లభించింది. ఇలాంటివి పునరావృతం అయితే మళ్లీ అదే సమాధానం వస్తుంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదివరకే బెంగాల్ భాజపా చీఫ్ దిలీప్‌ ఘోష్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ‘సీతల్‌కుచిలో నాటీ బాయ్స్‌కు బుల్లెట్లు దిగాయి. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే..వారికి ఇదే గతి పడుతుంది. బలగాల చేతిలో తుపాకులు కేవలం ప్రదర్శన కోసమేనని భావించిన వారు..సీతల్‌కుచిలో జరిగింది చూశారు. వారు మరోసారి అలాంటి తప్పులు చేయరు’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. భాజపా నేతల వ్యాఖ్యలపై తృణమూల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. 

ప్రస్తుతం బెంగాల్‌లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ ఉద్రిక్తంగా మారింది. కోచ్ బిహార్ జిల్లాలో తృణమూల్, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు కాల్పులకు దారితీశాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా..అంతకుముందే అదే ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో ఓ యువకుడు మృతి చెందారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని