close

తాజా వార్తలు

Updated : 01/08/2020 10:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

24 గంటల్లో 57,117 కేసులు..764 మరణాలు

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల వ్యవధిలో 57,117 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా నిర్ధారణ అయినవారి సంఖ్య 16,95,988కు చేరింది. వీరిలో 5,65,103 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 10,94,374 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 64.53 శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 36,569 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక కొత్తగా 764 మరణించడంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 36,511కు పెరిగింది. ప్రస్తుతం మరణాల రేటు 2.15 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇక శుక్రవారం ఒక్కరోజే దేశంలో 5,25,689 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఇవీ చదవండి..

కరోనాకు ఇంటి వద్దే చికిత్స..!

బ్రిటన్‌లో మరో టీకా ముందడుగు

30 సెకన్లలోనే కొవిడ్‌ నిర్ధారణ!


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని