close

తాజా వార్తలు

Updated : 01/03/2021 12:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టీకా తీసుకున్న మంత్రి ఈటల

హైదరాబాద్‌ : తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కరోనా టీకా వేయించుకున్నారు. హుజూరాబాద్‌ ప్రాంతీయ ఆస్పత్రిలో ఆయన టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ లేదని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ ఆదేశానుసారం నేటి నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 45 సంవత్సరాలు పైబడి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వాళ్లకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఎంపిక చేసిన కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందని..ఒక్క డోస్‌కి రూ.250 ఉండనున్నట్లు  తెలిపారు. వ్యాక్సిన్ విషయంలో అపోహలు నమ్మొద్దని కోరారు. అర్హులు రిజిస్ట్రేషన్ చేసుకొని అందుబాటులో ఉన్న ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.


ఇవీ చదవండి


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని