ధోని హెలికాప్టర్‌ చాక్లెట్లు!
close

తాజా వార్తలు

Published : 07/04/2021 07:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధోని హెలికాప్టర్‌ చాక్లెట్లు!

దిల్లీ: మహేంద్రసింగ్‌ ధోని పేరు చెప్పగానే హెలికాప్టర్‌ షాట్లు గుర్తొస్తాయి! ఇప్పుడు ఆ పేరుతోనే చాక్లెట్లు రాబోతున్నాయి. ముంబయికి చెందిన 7ఇంక్‌బ్రూస్‌ అనే ఆహార అంకుర సంస్థ మహి పేరిట ఈ చాక్లెట్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. మంగళవారం ఈ కొత్త బ్రాండ్‌ను విడుదల చేశారు. ఈ కంపెనీలో ధోని కూడా భాగస్వామి కావడం విశేషం. మోహిత్‌ భాగ్‌చంద్రానీ, అదిల్‌ మిస్త్రీ, కునాల్‌ పటేల్‌ ఆధ్వర్యంలోని ఈ సంస్థ.. మహి హెలికాప్టర్‌ షాట్‌తో పాటు అతడి జెర్సీ నంబర్‌-7 స్ఫూర్తితో ‘కాప్టర్‌-7’ అనే పేరిట ఈ చాక్లెట్లను తయారు చేస్తోంది. ఇప్పటికే ఈ బ్రాండ్‌ను ముంబయి, గోవా, బెంగళూరులో ప్రారంభించారు. ధోని స్వస్థలం జార్ఖండ్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌లోనూ త్వరలో ఈ చాక్లెట్లు విడుదల కాబోతున్నాయి. ప్రముఖ వంటల నిపుణుడు డేవిడ్‌ బెలోతో కలిసి ఈ చాక్లెట్లను తయారు చేస్తున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని