close

తాజా వార్తలు

Published : 21/04/2021 13:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెమ్‌డెసివిర్‌కు కొరత లేదు: ఈటల

హుజూరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కట్టడికి వైద్యఆరోగ్యశాఖ వంద శాతం పని చేస్తోందని ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ పర్యవేక్షణ కోసం ఐఏఎస్‌ స్థాయి అధికారిని నియమించినట్లు చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కడా రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల కొరత లేదని వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లా తుమ్మనపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణకు దగ్గర ఉన్న ప్రదేశాల నుంచి ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కోరాం. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత రాకుండా సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తు్న్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం’’ అని ఈటల తెలిపారు.

పల్లెలకు కరోనా వ్యాపిస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని మంత్రి అన్నారు. స్వీయ నియంత్రణ పద్దతులు పాటించాలని చెప్పారు. రాత్రి కర్ఫ్యూ విధించడం వల్ల కొన్ని కేసులు తగ్గుముఖం పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ వేసే కేంద్రాల సంఖ్యను పెంచామని.. అవసరమైతే ఇంకా పెంచుతామని ఈటల తెలిపారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని