అమ్మాయిల ఫొటోలు ఎరవేసి ₹60 లక్షలు లాగేశారు!
close

తాజా వార్తలు

Updated : 17/08/2020 07:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మాయిల ఫొటోలు ఎరవేసి ₹60 లక్షలు లాగేశారు!

విజయనగరం రింగురోడ్డు: అంతర్జాలం వేదికగా అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి, వారితో మాట్లాడించి సుమారు 3 వేల మంది నుంచి రూ.60లక్షలు పైగా లాగేసిన ఇద్దరు హైటెక్‌ మోసగాళ్లను విజయనగరం రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వివరాలను సీఐ సీహెచ్‌.శ్రీనివాసరావు ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయనగరం పట్టణానికి చెందిన టి.అశ్వనీరాజు పదో తరగతి వరకు చదువుకున్నాడు. గతంలో రియల్ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. అంతర్జాలంపై బాగా పట్టు సంపాదించాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగించే సమయంలో పట్టణానికి చెందిన సింధు భైరవి అనే వివాహితను తన కింద ఉద్యోగిగా చేర్చుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒడుదొడుకులతో సాగడం, చెడు వ్యసనాలకు బానిసవ్వడంతో సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.

అందులో భాగంగా 2017 నుంచి అంతర్జాలం వేదికగా అశ్లీల కార్యకలాపాలకు తెరలేపాడు. అందులో భాగంగా అందమైన అమ్మాయిల ఫొటోలు, వీడియోలు  ప్రజలను ఆకర్షించేందుకు ఓ వెబ్‌సైట్‌లో పెట్టేవాడు. ఇందుకుగాను ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సిందు భైరవిని తన భాగస్వామిగా చేర్చుకున్నాడు. ఆమెతో ఫోన్లు మాట్లాడించడం చేయించేవాడు. మరికొంత మంది అమ్మాయిలను సంప్రదించి వారి ఫొటోలను కూడా పంపించేవాడు. కావాల్సిన చోటికి రావాలంటే ముందుగా రూ.5వేల నుంచి రూ.8వేలు తన ఖాతాకు డబ్బులు పంపిస్తే వాళ్లు వస్తారని చెప్పేవాడు. డబ్బులు పంపిన వెంటనే ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేవాడు. తరువాత మరో నంబరుతో కార్యకలాపాలు చేసేవాడు. 

ఎన్నారైకి వల.. వెలుగులోకి మోసం

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ ఎన్నారై  ఇదే తరహాలో మోసపోయి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఏడాది మార్చి 20న తనకు రూ.8,500 పంపించమంటే అనుకోకుడండా ఆన్‌లైన్‌లో రూ.85వేలు పంపించాడు. ఆ తరువాత ఫోన్లు పని చేయకపోవడం, వెబ్‌సైట్‌లో కనిపించకపోవడంతో మోసపోయినట్లు గమనించి పోలీసుకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 11న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఆదివారం మధ్యాహ్నం రింగురోడ్డు సమీపంలో తిరుగుతున్న అశ్వనీరాజు, సింధుభైరవిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని