close

తాజా వార్తలు

Published : 02/12/2020 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాలింతకు ఎలాంటి ఆహారం?

మా అమ్మాయికి తొమ్మిదో నెల నడుస్తోంది. సహజ ప్రసవమవడానికే అవకాశాలున్నాయని  అంటున్నారు వైద్యులు.  డెలివరీ తరువాత తనకు బలం చేకూరడానికి ఎలాంటి ఆహారం పెట్టాలి?
 

- ఓ సోదరి

సాధారణంగా సహజ ప్రసవమైన తల్లికి అన్నిరకాల ఆహారపదార్థాలను పెట్టొచ్చు. పురిటినొప్పులు, ప్రసవ సమయంలో రక్తం పోవడం, ఒత్తిడి, మానసిక ఆందోళన... లాంటి కారణాల వల్ల ఆమె నీరసించిపోతుంది. కాబట్టి డెలివరీ అయిన వెంటనే సూప్స్‌, పాలు, వేడి జావలు, పండ్లరసాల్లాంటి తేలికగా జీర్ణమయ్యేవాటిని తరచూ అందించాలి. అన్నం, పప్పు, కూరగాయలు, పెరుగుతో భోజనం కూడా. అవి తినలేకపోతున్నప్పుడు ఇడ్లీ, బ్రెడ్‌, ఆమ్లెట్‌, చపాతీలు పెట్టొచ్చు.  బాలింతకు కొన్ని పదార్థాలు అరగవనే సమస్య ఉండదు. కాబట్టి తక్షణం శక్తినిచ్చే ఆహరం అందించాలి. ఆమె చుట్టూ వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూడాలి. అప్పుడే తన ధ్యాసంతా బిడ్డపైనే పెట్టి చక్కగా పాలు పట్టగలుగుతుంది.
మూడు విషయాలపై దృష్టి.. తను ఎంతసేపు ప్రసవ వేదన భరించింది? ఎంత అలసిపోయింది? తనకున్న ఆరోగ్య సమస్యలన్నింటినీ  దృష్టిలో పెట్టుకుని బాలింతకు ఆహార పట్టికను తయారుచేసుకోవాలి. దానికి అనుగుణంగా ఆహారాన్ని అందించాలి.  రెండోది...ప్రసవ సమయంలో చాలా రక్తం, అలాగే చెమట ద్వారా ఒంట్లోని నీటి శాతాన్ని కూడా కోల్పోతారు. కాబట్టి ద్రవాహారం ఇవ్వాలి. మూడోది...చాలామంది  బాలింతలకు ఒకే రకమైన ఆహారమే పెడుతుంటారు. లేదా పస్తులుంచుతారు. కొన్నిపదార్థాలను తిననివ్వరు. ఇది మంచి పద్ధతి కాదు. వారికి నచ్చిన ఆహారాన్ని అందివ్వాలి. పోషకాహారం ఉండేలా చూసుకోవాలి.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని