close

తాజా వార్తలు

Published : 09/03/2020 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 PM

1. ‘ఎమ్మెల్యేలు అడిగితే రిజర్వేషన్లు మార్చేస్తారా?’

రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఓటర్లను ప్రభావితం చేసే అన్నింటినీ తొలగించడం ఆనవాయితీ అని.. ఇప్పటి వరకు ఎక్కడా ఆ ప్రక్రియ చేపట్టలేదని ఆయన విమర్శించారు.  ఇష్టారీతిన రిజర్వేషన్లు, సరిహద్దులు మారుస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* స్థానిక ఎన్నికలు:తెదేపాతో సీపీఐ పొత్తు

2. సంక్షోభం దిశగా మధ్యప్రదేశ్‌ సర్కార్‌?

ఇటీవల 10 మంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడంతో వేడెక్కిన మధ్యప్రదేశ్‌ రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు కనపడకుండా పోయారు. అనంతరం బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. ఈ ఎమ్మెల్యేలంతా బెంగళూరు సమీపంలోని ఓ రిసార్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 17 మంది కాంగ్రెస్‌ ముఖ్య నేత, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మద్యంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిరోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రకటించారు. ఈనెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు తెలిపారు. ఆయా రోజుల్లో దుకాణాలకు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు అనిల్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మారుతీరావు ఆస్తి ఒక్క పైసా వద్దు: శ్రవణ్‌

తండ్రి ప్రాణాలు పోవాలని కోరుకున్న వ్యక్తి.. ఆస్తుల కోసం ఇప్పుడు హఠాత్తుగా ప్రేమ నటిస్తోందని అమృతనుద్దేశించి ఆమె చిన్నాన్న, ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు శ్రవణ్ అన్నారు. ఆమె వల్లే దారుణాలు జరిగాయని, ఇప్పుడు డబ్బు కోసమే డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడిన శ్రవణ్.. మారుతీరావును నాన్న అని పిలవడానికి అమృత ఇష్టపడడం లేదని మండిపడ్డారు. సోదరుడికి చెందిన ఒక్క పైసా తనకు అక్కర్లేదని చెప్పారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. హామీలకూ బడ్జెట్‌కు పొంతన లేదు: లక్ష్మణ్‌

ఎన్నికల సమయంలో తెరాస ఇచ్చిన హామీలకు.. ఇప్పడు ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పొంతన లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లు దండుకోవడం తప్ప ప్రభుత్వానికి ప్రజల బాగోగులు పట్టట్లేదని విమర్శించారు. పేదలకు రెండు పడక గదులు ఇళ్లు అటకెక్కాయని ఆరోపించారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం నిధులు తగ్గించిందని, ఏళ్ల తరబడి ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదని లక్ష్మణ్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.  ఈ రనౌట్‌ చూసి నవ్వకుండా ఉండగలరా?

క్రికెట్లో రనౌట్లు సాధారణం. ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపించినా, బద్దకంగా పరుగెత్తినా రనౌట్‌ అవ్వడం చూస్తుంటాం. కొన్నిసార్లు ఇద్దరూ ఒకేవైపు పరుగెత్తి ఔటవుతుంటారు. ‘ఫాక్స్‌ క్రికెట్‌’ ట్విటర్లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోను చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు. అంత సరదాగా ఉంది మరి. వాస్తవంగా ఇది టిక్‌టాక్‌లో రూపొందించిన వీడియో కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘కరోనా’..70వేల మంది ఖైదీలు ఇంటికి

కరోనా (కొవిడ్‌ 19) వైరస్‌తో ఇరాన్‌ అతలాకుతలమవుతోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన పడి ఆ దేశంలో తాజాగా మరో 43 మంది మృత్యువాత పడటంతో మొత్తం మృతుల సంఖ్య 237కి చేరింది. మరో 7వేల మందికి పైగా ఈ వైరస్‌ బారినపడి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌ పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న దాదాపు 70వేల మంది ఖైదీలను విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఎన్‌జీటీలో బయోమెట్రిక్‌ తాత్కాలిక రద్దు

8. ఏడుగురు నిందితులపై లుక్‌ అవుట్‌ నోటీసులు

యెస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌తో పాటు మరో ఆరుగురు నిందితులపై సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ) లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. రూ.4,300కోట్ల లావాదేవీల విషయంలో రానాకపూర్‌ అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విచారణ నిమిత్తం ఇప్పటికే ఆయనను అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ముంబయిలోని కోర్టులో హాజరుపర్చారు. కాగా.. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 11 వరకు రిమాండ్‌ విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కొట్టి చంపేస్తారా?..ఆ ధైర్యం ఏంటి!: ప్రకాశ్‌రాజ్‌

‘ఓ వ్యక్తిని పబ్లిక్‌లో సీసాలతో దాడి చేస్తారా? ఆ ధైర్యం ఏంటి?..’ అని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రశ్నించారు. ఆయన గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌కు సోమవారం మద్దతు తెలిపారు. వీరిద్దరు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ను అసెంబ్లీలో కలిశారు. ఇటీవల పబ్‌లో రాహుల్‌పై జరిగిన దాడి ఘటన గురించి చర్చించారు. ఈ కేసు విషయంలో నిందితులకు శిక్షపడాలని ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌ మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దాదా కొత్త టోర్నీతో రావాలి: గావస్కర్‌

భారత మహిళల క్రికెట్‌ ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వచ్చే ఏడాది నుంచి ‘ఉమెన్స్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌’ను నిర్వహించాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ సూచించారు. ‘‘భారత మహిళల జట్టు మెరుగవ్వడానికి బీసీసీఐ ప్రభావం ఎంతో ఉంది. బీసీసీఐ వారి పురోగతిపై దృష్టిసారిస్తుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు పంపించి ముక్కోణపు సిరీస్‌ (ఇంగ్లాండ్‌, ఆసీస్‌, భారత్‌) ఆడించింది. దీంతో హర్మన్‌సేనకు పిచ్‌, అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మంచి అవకాశం లభించింది’’ అని తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.