close

తాజా వార్తలు

Published : 16/03/2020 20:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్‌ రాజుతో గొడవ.. రామ్‌తో ‘జగడం’

ఇంటర్నెట్‌డెస్క్‌: అల్లు అర్జున్‌ కెరీర్‌కు మంచి బ్రేక్‌నిచ్చిన చిత్రం ‘ఆర్య’. దర్శకుడు సుకుమార్‌ తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. వన్‌సైడ్‌ లవ్‌ అంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘ఆర్య’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తర్వాత సుకుమార్‌.. రామ్‌తో ‘జగడం’ తీశారు. అయితే, ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. అసలు ఈ సినిమాను తొలుత మహేష్‌, ఆ తర్వాత అల్లుఅర్జున్‌తో తీయాలని అనుకున్నారట. అయితే, దిల్‌రాజుతో జరిగిన చిన్న గొడవ కారణంగా రామ్‌తో తీయాల్సి వచ్చింది.

‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలా మాట్లాడాలో పెద్దగా తెలిసేది కాదు. ప్రపంచం కూడా మనలాగే ఉంటుందనుకోలేదు. ‘ఆర్య’ హిట్‌ కావడంతో గాల్లో తేలిపోయా. ఆ సందర్భంలో బన్నితో ‘జగడం’ చేయాలనుకున్నా. కథతో సహా అన్ని సిద్ధం అయ్యాయి. అయితే, అదే సమయంలో దిల్‌రాజుతో చిన్న సమస్య వచ్చింది. కోపం పట్టలేకపోయా. బాగా ఎమోషనల్‌ అయిపోయా. వెంటనే రాత్రికిరాత్రే రామ్‌ దగ్గరకు వెళ్లిపోయి, కథ చెప్పడం.. ఒకే చేయించుకోవడం అయిపోయింది. అంతేకాదు.. మరుసటి రోజే ముహూర్తం కూడా పెట్టించేశా. ముహూర్త సన్నివేశానికి బన్నిని, రాజుగారిని పిలిచా’’

‘‘అక్కడకు రాజుగారు వచ్చి ‘నీకు బుద్ధుందా? ఏంటి ఇలా చేశావ్. కోపం వస్తే, కనీసం చెప్పకుండా సినిమాను ఓపెన్‌ చేసేస్తావా’ అని తిట్టారు. నేను అమాయకుడినని ఆయనకు తెలుసు. నేనేమో నాది వీరత్వం అనుకున్నా. ‘మీరు కథలో ఆ మార్పు చేయాలి.. ఈ మార్పు చేయాలి’ అంటున్నారు అసలు కుదరదు అని చెప్పేశా. మొదటి సినిమా హిట్‌ కావడంతో నా జడ్జిమెంట్‌ను ఎవరైనా తప్పు అని చెబితే కోపం వచ్చేసేది. రామ్‌ చేసిన పాత్ర బన్ని లేదా మహేష్‌ అయితే బాగుండేది. అతడి తమ్ముడి పాత్రకు రామ్‌ అయితే సరిపోయేవాడు. కానీ, అలా జరగలేదు. ‘జగడం’ ఫ్లాప్‌ కావడంతో నాలోనూ మార్పు వచ్చింది. అప్పటి నుంచి ఎవరు ఏది చెప్పినా, వినేవాడిని.’’ అంటూ ‘జగడం’ వెనుక కథను ఓ సందర్భంలో పంచుకున్నారు సుకుమార్‌. ‘జగడం’ విడుదలైన మార్చి 16 నాటికి 13ఏళ్లు పూర్తి చేసుకుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.