వుహాన్‌ వాసులకు బంపర్‌ ఆఫర్‌!
close

తాజా వార్తలు

Published : 17/05/2020 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వుహాన్‌ వాసులకు బంపర్‌ ఆఫర్‌!

వుహాన్‌: కరోనా వైరస్‌తో ఉక్కిరిబిక్కిరైన వుహాన్‌ నగరం తాజాగా కోలుకుంటోంది. ఈ సమయంలో ఆటోమొబైల్‌ కంపెనీలను ఆదుకునేందుకు అక్కడి అధికారులు తాజాగా సబ్సిడీలు ప్రకటించారు. ముఖ్యంగా వుహాన్‌లో తయారయ్యే ఎలక్ట్రిక్‌ కార్లను కొనుగోలుపై 1000 యువాన్ల సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. చమురుతో నడిచే కార్లపై 5వేల యువాన్ల సబ్సిడీ ఇస్తామని నగర అధికారులు వుహాన్‌ ప్రజలకు మెసేజ్‌ రూపంలో తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వుహాన్‌లో తయారయ్యే ఎయిర్‌ కండీషనర్లు, వాటర్‌ హీటర్లు, రిఫ్రీజిరేటర్లపై కూడా సబ్సిడీ పొందవచ్చని ప్రకటించారు.

చైనాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన వుహాన్ ఆటోమొబైల్‌, ఎలక్ట్రిక్‌ ఉత్పత్తులకు పేరుగాంచింది. వుహాన్‌లో గత సంవత్సరం దాదాపు 15లక్షల వాహనాలు ఉత్పత్తి అయ్యాయి. కరోనావైరస్‌ విజృంభణ నేపథ్యంలో దాదాపు 76రోజుల పాటు వుహాన్‌ నగరం లాక్‌డౌన్‌లోనే ఉండిపోయింది. ఈ సమయంలో ఆటోమొబైల్‌ కంపెనీలు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల కొనుగోళ్లు స్తంభించిపోయాయి. తాజాగా ఈ కంపెనీలను ఆర్ధికంగా ఆదుకునేందుకు ఈ సబ్సిడీలు ఇస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని