హాంగ్‌కాంగ్‌కు టిక్‌టాక్‌ గుడ్‌బై..
close

తాజా వార్తలు

Updated : 07/07/2020 18:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హాంగ్‌కాంగ్‌కు టిక్‌టాక్‌ గుడ్‌బై..

 టెక్‌కంపెనీలు బయటకు వెళ్లేందుకు యత్నాలు
 అదేబాటలో టిక్‌టాక్‌

హాంగ్‌కాంగ్‌: జాతీయ భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే హాంగ్‌కాంగ్‌ మార్కెట్‌ను వీడి బయటకు పోవాలని ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ నిర్ణయించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధి  వెల్లడించారు. చాలా టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే హాంగ్‌కాంగ్‌ను వీడి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటిల్లో ఫేస్‌బుక్‌ కూడా ఉంది. ఆ ప్రాంతంలో ఫేస్‌బుక్‌ వినియోగదారుల డేటాను ప్రభుత్వానికి ఇచ్చే అంశాన్ని ఫేస్‌బుక్‌ పక్కనబెట్టింది.  
‘‘ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాలతో మేము హాంగ్‌కాంగ్‌లో మా యాప్‌ కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించాము’’ అని బైట్‌డ్యాన్స్‌ ప్రతినిధి  ఓ ఆంగ్ల వార్తా సంస్థకు వెల్లడించారు.  కంపెనీ ప్రతినిధి కెవిన్‌ మేయర్‌ మాట్లాడుతూ వినియోగదారుల డేటాను గతంలో కూడా చైనాలో నిల్వ చేయలేదని పేర్కొన్నారు. 

హాంగ్‌కాంగ్‌ నుంచి టిక్‌టాక్‌ వైదొలగడం వల్ల కంపెనీకి పెద్దనష్టం ఉండదు. అక్కడ 1,50,000 వినియోగదారులు మాత్రమే ఉన్నారు. ఈ ఏడాది మొదటి వరకు టిక్‌టాక్‌కు ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.  చైనాలో బైట్‌డ్యాన్స్‌కు డోయిన్‌ అనే యాప్‌ ఉంది . ఇది కూడా టిక్‌టాక్‌ వలే పనిచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగించేందుకు టిక్‌టాక్‌ను తయారు చేసింది. కానీ, దీనిలో డేటా చైనాకు వెళుతోందనే ఆరోపణలు రావడంతో భారత్‌ బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని