కిడ్నాపర్లనుంచి యువకుడిని కాపాడిన పోలీసులు
close

తాజా వార్తలు

Published : 01/06/2020 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కిడ్నాపర్లనుంచి యువకుడిని కాపాడిన పోలీసులు

విజయవాడ: విజయవాడ నగరానికి చెందిన  ఓ యువకుడ్ని కిడ్నాపర్ల చెర నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు విడిపించారు. సమాచారం వచ్చిన కేవలం 30 నిమిషాల్లోనే తాడేపల్లి పోలీసులు కిడ్నాపర్ల  చెర నుంచి విముక్తి కల్పించారు. విజయవాడకు చెందిన శేఖర్‌ అనే యువకుడు నగరంలోని ఓ వ్యక్తి వద్ద కారు తాకట్టు పెట్టి రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. శనివారం మధ్యాహ్నం శేఖర్‌ను తాడేపల్లికి చెందిన కొందరు కిడ్నాపర్లు కృష్ణలంక వద్ద అపహరించారు. అనంతరం శేఖర్ తండ్రికి ఫోన్‌ చేసి  ‘మీ కుమారుడ్ని అపహరించాం. రూ.4లక్షలు బకాయి ఉన్నాడు...వెంటనే ఇవ్వాలి’ అని ఫోన్‌ చేశారు. దీంతో శేఖర్‌ తండ్రి  శనివారం అర్ధరాత్రి తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న 30 నిమిషాల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. శేఖర్‌ను క్షేమంగా కిడ్నాపర్ల చెర నుంచి విడిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని