నేను బతికే ఉన్నా.. ఉద్యోగం ఇవ్వండి
close

తాజా వార్తలు

Published : 11/07/2020 07:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను బతికే ఉన్నా.. ఉద్యోగం ఇవ్వండి


ఆరోగ్యాధికారి డాక్టర్‌ వెంకటరమణకు వినతిపత్రం అందిస్తున్న కృష్ణమ్మ

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: బతికున్న శాశ్వత పారిశుద్ధ్య కార్మికురాలిని 2012లోనే చనిపోయినట్లుగా ఆమె స్థానంలో నగరపాలకసంస్థ అధికారులు మరో మహిళకు ఉద్యోగం ఇచ్చేశారు. బతికున్న పారిశుద్ధ్య కార్మికురాలికి మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేసి మరో మహిళకు ఉద్యోగం కల్పించడం గమనార్హం. నేను బతికే ఉన్నాను, న్యాయం చేయాలంటూ పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మ శుక్రవారం నగరపాలకసంస్థ ఆరోగ్యాధికారి వెంకటరమణను కలిసి విన్నవించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న మహిళ ఎవరో తనకు తెలియదని, తనకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేయించి కృష్ణమ్మకు న్యాయం చేస్తామని తెలియజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని