అక్కడ రూ.85..ఇక్కడ రూ.370
close

తాజా వార్తలు

Published : 12/07/2020 08:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్కడ రూ.85..ఇక్కడ రూ.370

● కర్ణాటక రాష్ట్రంలోని ఇటికెలకు క్యూ కడుతున్న మద్యం ప్రియులు

ఆదోని నేరవార్తలు, గ్రామీణం, న్యూస్‌టుడే: మన రాష్ట్రంలో మద్యం ధరలు విపరీతంగా పెరిగిపోవడం..మరో పక్క కావాల్సిన బ్రాండ్‌ మద్యం దొరక్కపోవడంతో ఆదోని ప్రాంత మద్యం ప్రియులు నాలుగురోజుల నుంచి కర్ణాటక రాష్ట్రంలోని ఇటికెల గ్రామానికి క్యూ కడుతున్నారు. ఆదోని మండలం సంతేకూడ్లురు, పెద్దహరివాణం గ్రామాల మధ్య ఉన్న కర్ణాటక రాష్ట్రం శిరుగుప్ప తాలుకా పరిధిలో ఇటికెల గ్రామం ఉంది. ఇక్కడ జనాభా 500 మందికి మించి ఉండరు. ఇలాంటి గ్రామంలో ఏకంగా కర్ణాటక ప్రభుత్వం ఓ మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో నాలుగు రోజుల క్రితం మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఓ ప్రముఖ బ్యాండ్‌ 180 మి.లీ. మద్యం ధర మన రాష్ట్రంలో రూ.370లు పలికితే.. కర్ణాటకలో ఇదే మద్యం ధర రూ.85 పలుకుతోంది. ధర తక్కువ కావడం.. ఆదోని పట్టణానికి ఇటికెల గ్రామం కేవలం 15 కి.మీ.ల దూరం ఉండటంతో మద్యం ప్రియులు వరుస కడుతున్నారు. కొందరు ద్విచక్ర వాహనాల్లో.. మరికొందరు కార్లు.. ఆటోల్లో ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం తాగేందుకు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో మన రాష్ట్రానికి మద్యం ఆదాయం కాస్త గండి పడినట్లవుతోందని పలువురు చర్చించుకుంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని