close

తాజా వార్తలు

Published : 26/03/2020 06:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘కరోనాను దాచిన’ పోలీస్‌ అధికారిపై హత్యాయత్నం కేసు!

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: లండన్‌ నుంచి వచ్చిన తనయుడి వివరాలను గోప్యంగా ఉంచి, అతడిని హోంక్వారంటైన్‌ చేయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అధికారిపై డీఎంహెచ్‌ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కుమారుడిలో కరోనా నిర్ధారణ కాగా.. మంగళవారం పోలీసు అధికారికి, వారి ఇంటి వంట మనిషికి ఈ వ్యాధి సోకినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యాధికారి డా.ఎల్‌.భాస్కర్‌నాయక్‌ బుధవారం ఎస్పీ సునీల్‌దత్‌ను కలిశారు. కరోనా వ్యాప్తికి కారణమైన పోలీస్‌ అధికారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఇంకా కేసు నమోదు కాలేదని ఎస్పీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని