Instagram: ఇకపై ఇన్‌స్టా రీల్స్‌.. 60 సెకన్లు

తాజా వార్తలు

Updated : 28/07/2021 16:41 IST

Instagram: ఇకపై ఇన్‌స్టా రీల్స్‌.. 60 సెకన్లు

15-30 సెకన్ల రీల్స్‌..60 సెకన్లకు పెంపు

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువత అధికంగా వినియోగించే సామాజిక మాధ్యమాల్లో ఇన్‌స్టాగ్రామ్‌ ఒకటి.  ఇందులో ఉండే ‘రీల్స్‌’ ఫీచర్‌లో తక్కువ నిడివితో.. విలువైన సమాచారంతో పాటు.. యువత తమ ప్రతిభను పాటలు, నృత్యాలను వీడియోల రూపంలో అప్‌లోడ్‌ చేసే వీలుంటుంది. తాజాగా ఈ రీల్స్‌కు సంబంధించి మార్పులు చేస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకటించింది. ఇప్పటి వరకూ రీల్స్‌లో వీడియో నిడివి 15-30 సెకన్లు ఉండగా..దాన్ని కాస్త 60 సెకన్ల వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.  ఇటీవలే టిక్‌టాక్‌, ది రీల్స్‌ అర్చ్‌ రైవల్‌ తమ యూజర్లు రూపొందించే వీడియోల్లో వైవిధ్యం చూపించేందుకు వీడియో నిడివి కాస్త 3 నిమిషాలకు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మార్పును గమనించిన ఇన్‌స్టాగ్రామ్‌.. రీల్స్‌ వీడియో నిడివిని 60 సెకన్లకు పెంచింది. అంతేకాదు.. టీనేజర్లను దృష్టిలో పెట్టుకొని వారి ఖాతాలకు భద్రత కల్పించే దిశగా అడుగులు వేసింది. కొత్తగా ఇన్‌స్టా అకౌంట్‌ ప్రారంభించే టీనేజర్స్‌ (16-18) వయసు ఉన్న వారి అకౌంట్లను ప్రారంభం నుంచే ప్రైవేట్‌లోకి మార్చనుంది. అపరిచితుల నుంచి ఎలాంటి అభ్యంతరకరమైన సందేశాలు రాకుండా , యూజర్ల వివరాలకు భంగం కలుగకుండా ఉండేందుకే ఈనిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. వారి అకౌంట్ల ప్రైవసీకి సంబంధించి టీనేజర్ల ఇన్‌స్టా అకౌంట్స్‌కు పుష్‌ నోటిఫికేషన్లను పంపిస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా భద్రతను దృష్టిలో పెట్టుకొని టీనేజర్లు పబ్లిక్‌లో ఉన్న వారి అకౌంట్లను ప్రైవేటులోకి మార్చుకోవాలని కోరింది.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని