
తాజా వార్తలు
అప్పుడెందుకు ఎన్నికలు జరపలేదు: బొత్స
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఓ రాజకీయ నాయకుడిలా మాట్లాడడం బాధాకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికలు రెండు మూడు నెలలు వాయిదా వేస్తే వచ్చే నష్టమేంటని.. ఎన్నికలపై ఎస్ఈసీకి ఎందుకింత ఆరాటం అని ప్రశ్నించారు. ప్రస్తుతం అన్ని చోట్లా కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలకు తొందరెందుకన్నారు. గడువు దాటినా చంద్రబాబు హయాంలో ఎందుకు ఎన్నికలు జరపలేదని నిలదీశారు. ఎన్నికల జరిగితే తెదేపాకు కనీసం 10 శాతం సీట్లు కూడా రావని బొత్స ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డతో లాలూచీపడి తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. అధికారమే కాదు, బాధ్యత కూడా ఉందని ఎస్ఈసీ గుర్తుపెట్టుకొని వ్యవహరించాలన్నారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాలను దుర్వినియోగం చేయకూడదని బొత్స సూచించారు.
ఇవీ చదవండి..
మీ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే?
ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల