
తాజా వార్తలు
కర్ణాటకలో నలుగురి దారుణ హత్య
ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం!
బెంగళూరు: కర్ణాటకలో నలుగురు దారుణ హత్యకు గురయ్యారు. రాయచూర్ జిల్లా సింధనూరులో నలుగురిని గుర్తు తెలియని ముఠా హత్య చేసింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. నలుగురిని అతి కిరాతకంగా నరికి చంపారు. మృతుల్లో సావిత్రమ్మ (55), శ్రీదేవి (38), హనుమేశ్ (35), నాగరాజు (33) ఉన్నారు. ప్రేమ పెళ్లి వ్యవహారంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ యువతీ యువకుడు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. యువకుడి బంధువులపై యువతి తరఫు బంధువులు దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
Tags :