
తాజా వార్తలు
అవసరాల కోసం ఆ డబ్బు వాడేసిన రవితేజ
ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన మాస్ మహారాజ్
హైదరాబాద్: మాస్, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించి మాస్ మహారాజ్‌గా గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు రవితేజ. ఆయన హీరోగా నటించిన ‘క్రాక్’ సంక్రాంతిని పురస్కరించుకుని ఈ నెల 9న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. తాను ఎంతో అపురూపంగా భావించే ఓ చెక్‌ను అవసరాల కోసం ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అదే తన మొదటి సంపాదన అని ఆయన అన్నారు.
‘అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘నిన్నే పెళ్లాడతా’లో నేను ఓ చిన్న పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే, అదే సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. అందుకుగాను ఓ చెక్‌పై రూ.3500 రాసి.. నాగ్ సంతకం చేసి ఇచ్చారు. అదే నా మొదటి రెమ్యూనరేషన్. చాలారోజులపాటు ఆ చెక్‌ను భద్రంగా దాచుకున్నాను. కొంతకాలం తర్వాత అవసరాల రీత్యా డబ్బు కావాల్సిఉండడంతో చెక్‌ను బ్యాంక్‌లో మార్చేశాను’ అని రవితేజ వివరించారు. పోతరాజు వీరశంకర్ పాత్రలో రవితేజ మెప్పించిన క్రాక్ సినిమాలో ఆయనకు జంటగా శ్రుతిహాసన్ సందడి చేశారు.
ఇదీ చదవండి
రివ్య్యూ: క్రాక్