
తాజా వార్తలు
జీపు బోల్తా: ఒకరి మృతి, 15 మందికి తీవ్రగాయాలు
విశాఖపట్నం: విశాఖ జిల్లా ముంచింగిపుట్టి మండలం పనసపుట్టు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ముంచింగిపుట్టి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెదబయలు మండలం గుడుగుపల్లి నుంచి 20 మంది ఒడిశాలోని కేందుగూడలో మొక్కులు తీర్చుకునేందుకు వెళ్తుండగా పనసపుట్టు మలుపు వద్దన జీపు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతురాలు కొర్ర సీతమ్మ(58)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన చిన్నారి లావణ్య విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది.
Tags :
క్రైమ్
జిల్లా వార్తలు