‘అమ్మ ప్రభుత్వం’ కోసం చిన్నమ్మ సందేశం! 
close

తాజా వార్తలు

Published : 24/02/2021 16:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అమ్మ ప్రభుత్వం’ కోసం చిన్నమ్మ సందేశం! 

జయలలితకు నివాళులర్పించిన శశికళ

చెన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఆమె నెచ్చెలి శశికళ నివాళులర్పించారు. జయలలిత 73వ జయంతి సందర్భంగా టి.నగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా జయలలిత అభిమానులను ఉద్దేశించి చిన్నమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో జయలలిత అనుచరులంతా డీఎంకేకు వ్యతిరేకంగా సంఘటితం కావాలన్నారు. డీఎంకే పార్టీయే తమందరికీ ఉమ్మడి శత్రువన్న శశికళ.. ఆ పార్టీకి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

జయలలిత నేతృత్వంలో ఏర్పాటై కొనసాగుతున్న ప్రభుత్వాన్ని మరో వందేళ్ల పాటు కొనసాగించేలా పనిచేయడమే మన ముందున్న  లక్ష్యమని వ్యాఖ్యానించారు.  జైలు నుంచి విడుదలకు ముందు కరోనా బారిన పడిన తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాట ‘అమ్మ ప్రభుత్వం’ కొనసాగేలా శ్రేణులంతా కృషిచేయాలని కోరారు. అయితే, రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని అమ్మ ప్రభుత్వంగా శశికళ పేర్కొనడం గమనార్హం. పార్టీ కార్యకర్తలు, ప్రజలను త్వరలోనే కలుస్తానని ఆమె అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని