ద్వివేది, గిరిజా శంకర్‌పై ఎస్‌ఈసీ చర్యలు
close

తాజా వార్తలు

Updated : 26/01/2021 12:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ద్వివేది, గిరిజా శంకర్‌పై ఎస్‌ఈసీ చర్యలు

అమరావతి: ఏపీ పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌పై చర్యలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాలేదని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో 3.61లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోయారన్నారు.  సాంకేతిక, న్యాయ చిక్కుల వల్ల 2019 జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఇద్దరు అధికారులు విధి నిర్వహణలో విఫలమయ్యారని, నిబంధనల ఉల్లంఘనను సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని ఎస్‌ఈసీ ఆదేశించారు.

ఉన్నతాధికారులతో ఎస్ఈసీ రేపు సమీక్ష
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జడ్పీ సీఈవోలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, పంచాయతీరాజ్‌, వైద్యారోగ్యశాఖ అధికారులు సమావేశానికి హాజరుకానున్నారు. సమీక్షకు హాజరు కావాలని ఈ మేరకు సీఎస్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చదవండి....

ఎన్నికలు, కరోనా టీకాలూ ఒకేసారి సాధ్యం కాదు

ఎస్‌ఈసీ ఎందరిని బదిలీ చేసినా పట్టించుకోం
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని