close

తాజా వార్తలు

Published : 12/02/2021 18:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్పుత్నిక్‌ టీకాకు 26దేశాల ఆమోదం‌!

వెల్లడించిన ఆర్‌డీఐఎఫ్‌

మాస్కో: రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వీ టీకాకు ఇప్పటికే 26 దేశాలు ఆమోదం తెలిపాయని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్) వెల్లడించింది. తాజాగా మోంటెనెర్గో, సెయింట్‌ విన్సెంట్‌, గ్రెనాడైన్స్‌ దేశాలు స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. దీంతో ప్రపంచంలో అత్యధిక దేశాల అనుమతి పొందిన మూడు వ్యాక్సిన్‌లలో స్పుత్నిక్‌-వీ తొలిస్థానంలో నిలిచిందని ఆర్‌డీఐఎఫ్‌ ప్రకటించింది.

అయితే, ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసుకున్న సంస్థగా స్పుత్నిక్‌ ఇదివరకు ప్రకటించుకుంది. అంతేకాకుండా అత్యవసర వినియోగం కింద రష్యాలో వ్యాక్సిన్‌ పంపిణీ చేపట్టింది. కానీ, వ్యాక్సిన్‌ అనుమతిపై అక్కడి ప్రజల్లో అనుమానాలు వ్యక్తం కావడంతో వాటిని తీసుకునేందుకు రష్యన్లు కాస్త వెనుకంజ వేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇప్పటి వరకు అక్కడ కేవలం 22లక్షల మంది మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు తెలిపాయి. అయితే, ఆర్‌డీఐఎఫ్‌ తయారుచేసిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ సమర్థవంతంగానే పనిచేస్తున్నట్లు లాన్సెట్‌ నివేదిక ఈమధ్యే వెల్లడించింది. దాదాపు 92శాతం సమర్థత చూపించినట్లు స్పుత్నిక్ ఇదివరకే ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా 76దేశాల్లో..
ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ ఇప్పుడిప్పుడే చాలా దేశాల్లో అందుబాటులోకి వస్తోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, 76దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమయ్యింది. మొత్తం ఇప్పటివరకు 15.9కోట్ల మంది వ్యాక్సిన్‌ తీసుకోగా, ప్రపంచ వ్యాప్తంగా నిత్యం 50లక్షల మంది టీకా తీసుకుంటున్నట్లు సమాచారం. అమెరికాలో అత్యధికంగా 4.8కోట్ల డోసులను అందజేసినట్లు సీడీసీ నివేదిక వెల్లడించింది. ఇప్పటి వరకు ఫైజర్‌, మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్‌తో పాటు భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన టీకాలు ప్రపంచ వ్యాప్తంగా అధిక సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి.

అమెరికా తర్వాత, కరోనా వ్యాక్సిన్‌ను వేగంగా అందిస్తోన్న దేశాల్లో చైనా కూడా ముందుంది. ఇప్పటికే అక్కడ దాదాపు 4కోట్ల మందికి టీకా ఇచ్చినట్లు సమాచారం. అటు యూరోపియన్‌ యూనియన్‌లో దాదాపు 2కోట్ల మంది టీకా తీసుకోగా, బ్రిటన్‌లో కోటిన్నర మందికి వ్యాక్సిన్‌ అందించారు. భారత్‌లోనూ ఇప్పటివరకు 75 లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇవీ చదవండి..
రష్యా వ్యాక్సిన్‌తో యాంటీబాడీస్‌ ఉత్పత్తి
రష్యాలో కొనసాగుతున్న ఆందోళనలు!



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని