
తాజా వార్తలు
రైళ్లలోనూ రెడీ-టు-ఈట్ మీల్స్!
ఐఆర్సీటీసీ సన్నాహాలు
దిల్లీ: రైల్వే ప్రయాణికులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచుకొనేలా ఐఆర్సీటీసీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా రైలు ప్రయాణికులకు రెడీ-టు-ఈట్ మీల్స్ అందించేలా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం రైల్వేశాఖ ఇప్పటికే హల్దీరామ్స్, ఐటీసీ, ఎంటీఆర్, వాఘ్బక్రి వంటి ప్రముఖ ఆహార సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో దీనిపై కేంద్రం దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఈ సేవలను త్వరగా అందుబాటులోకి తేవడం ద్వారా ఐఆర్సీటీసీకి కరోనాతో వాటిల్లిన నష్టాన్ని పూడ్చాలని కేంద్రం భావిస్తోంది. ప్రముఖ ఆహార సంస్థలతో సేవలందించడం ద్వారా ప్రయాణికుల్ని ఆకర్షితుల్ని చేసి నష్టాలను పూడ్చుకొనేందుకు ఈ కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. రెడీ-టు-ఈట్ మీల్ విధానం ఇప్పటికే విమానాల్లో విరివిగా అమలవుతోంది. దీన్నుంచి ఆయా విమానయాన సంస్థలు మంచి లాభాలను గడిస్తున్నాయి. దీంతో ఇదే విధానాన్ని రైల్వేలో కూడా అమలుచేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆహార రంగంలో ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు సమాచారం.
ఇవీ చదవండి..
అభిమానులకు ‘ఆర్ఆర్ఆర్’ బ్రేకింగ్ న్యూస్