పోలీస్‌ స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం
close

తాజా వార్తలు

Published : 09/01/2021 14:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలీస్‌ స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

పత్తికొండ గ్రామీణం: కర్నూలు జిల్లా పత్తికొండ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం మధ్యాహ్నం రామాంజనేయులు అనే యువకుడు రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. అతని సోదరుడు ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికను గత సోమవారం తీసుకెళ్లాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... వివరాలు రాబట్టేందుకు తనను వేధిస్తున్నారని ఆరోపించాడు.  బాలిక ఆచూకీ తెలపాలంటూ పోలీసులు చితకబాదారని, వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపాడు. ఈ విషయమై సీఐ ఆది నారాయణరెడ్డిని వివరణ కోరగా మైనర్‌ బాలిక అదృశ్యం కేసు విషయమై రామాంజనేయులును విచారించామే తప్ప ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని చెప్పారు. బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చదవండి..
ఎన్నికల నియమావళిపై సీఎస్‌కు నిమ్మగడ్డ లేఖ

ఆభరణాల కొనుగోళ్లకు కొత్త నిబంధన వర్తించదు

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని