close
నిందితులపై నిరంతర నిఘా

ఆరోగ్యంపై గంట గంటకు నివేదిక
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ

చర్లపల్లి, షాద్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: చర్లపల్లి కారాగారంలో ‘దిశ’ కేసు నిందితులను జైలు అధికారుల నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వారి మానసిక పరిస్థితిని బేరీజు వేయడానికి వైద్యుల సహాయం తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితిపై గంటగంటకు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు. మహానది బ్యారక్‌లో నాలుగు సింగిల్‌ సెల్‌లలో నిందితులను ఉంచారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా చర్యలు చేపట్టారు. ఇతర ఖైదీలెవరూ ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించవద్దని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర కార్యాలయానికి అనుసంధానం చేసిన సీసీ కెమెరాల ద్వారా ఉన్నతాధికారులు సైతం వారిని పర్యవేక్షిస్తున్నారు.

కస్టడీకి కోరిన పోలీసులు
జైల్లో ఉన్న నిందితులను విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు షాద్‌నగర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అదనపు ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ శ్యాంప్రసాద్‌ దీనిపై విచారణను మంగళవారానికి వాయిదా వేసినట్లు తెలిసింది. మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె.మూర్తి సోమవారం జైలును సందర్శించి భద్రతను పర్యవేక్షించారు. ప్రహరీని క్షుణ్నంగా పరిశీలించారు. ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నందున కస్టడీకి తీసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవచ్చో గమనించారు. జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. నిరసన ప్రదర్శనలను, ఆందోళనలకు అనుమతి లేదని తెలిపారు. నిందితులపై ఎందుకింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారంటూ ఆందోళనకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిరసన తెలిపే స్వేచ్ఛ, స్వతంత్రత తమకు లేదా.. అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిరసనల నేపథ్యంలో అవసరమైతే జైలులోనే ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ చేయవచ్చని లేదా రాత్రికి రాత్రే నిందితులను కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

వీడియోపై ఆరా..
చర్లపల్లి జైలు నుంచి నిందితుల వీడియో బయటకు రావడంపై ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు సెల్‌ఫోన్‌ను లోపలకు ఎలా అనుమతించారో తెలియాల్సి ఉంది. ఓ కానిస్టేబుల్‌ వీడియో రికార్డింగ్‌ చేస్తుంటే మిగిలిన సిబ్బంది ఫొటోలు సేకరించినట్లు తెలిసింది. అయితే వారిపై ఎలాంటి చర్యలు లేకుండా కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.