close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెరాస, భాజపా నాయకుల బాహాబాహీ

కరీంనగర్‌లో ఉద్రిక్తత

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: తెరాస విద్యార్థి విభాగం, భాజపా యువ మోర్చా నాయకులు ఆదివారం చేపట్టిన నిరసన కార్యక్రమాలు కరీంనగర్‌లో ఉద్రిక్తతకు దారితీశాయి. కేసీఆర్‌, తెరాస ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ నిరసనగా తెలంగాణ చౌక్‌ వద్ద తెరాసవి నాయకులు సంజయ్‌ దిష్టిబొమ్మకు నిప్పు అంటించారు. అదే ప్రాంతంలో ఆందోళన చేపట్టడానికి వచ్చిన యువమోర్చా నాయకులు  దిష్టిబొమ్మను దహనం చేయకుండా అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు పార్టీల నాయకులు తోపులాటకు దిగారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. అనంతరం ఇరువర్గాలు నిరసనకు దిగాయి. వారందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాలకు తరలించి సాయంత్రం విడిచిపెట్టారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు