
తాజా వార్తలు
ఏడేళ్ల క్రితం నాటి ఘటనలో అనూహ్య నిజాలు వెలుగులోకి
బీజాపూర్: అది 2012 జూన్ 28 రాత్రి.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా సర్కేగూడలో మావోయిస్టుల ఏరివేతలో భాగంగా భద్రతా సిబ్బంది భీకర కాల్పులు జరిపారు. 17 మంది మావోయిస్టులను మట్టుబెట్టినట్లు ప్రకటించారు. అయితే నిజానికి వారంతా నక్సల్స్ కారట. భద్రతాసిబ్బంది పొరబాటు వల్ల 17 మంది అమాయక గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా జ్యుడిషీయల్ దర్యాప్తులో తేలింది. వివరాల్లోకి వెళితే..
ఏడేళ్ల క్రితం జరిగిన ఈ కాల్పుల ఘటనపై అనేక అనుమానాలు తలెత్తడంతో అప్పటి భాజపా ప్రభుత్వం దర్యాప్తు కోసం జస్టిస్ వీకే అగర్వాల్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ కమిషన్ విస్తృత స్థాయిలో దర్యాప్తు జరిపి ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆదివారం ఈ నివేదిక మీడియాకు లీకైంది.
నిజానికి 2012 జూన్ 28 రాత్రి సర్కేగూడ గ్రామస్థులు ‘బీజ్ పందుమ్’ పండగ గురించి చర్చించేందుకు ఓ చోట సమావేశమయ్యారు. అయితే మావోయిస్టుల సమావేశానికి గ్రామస్థులు హాజరైనట్లు సమాచారం రావడంతో వెంటనే భద్రతాసిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. తొలుత గ్రామస్థులు తమపై కాల్పులు జరిపారని, ఆ తర్వాత తాము ఎదురుకాల్పులకు పాల్పడినట్లు అప్పట్లో భద్రతాసిబ్బంది తెలిపారు. అయితే గ్రామస్థులు సిబ్బందిపై ఎలాంటి కాల్పులు జరపలేదని తాజాగా జ్యుడీషియల్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
‘ఒకవేళ గ్రామస్థులు కాల్పులు జరిపితే అక్కడే ఉన్న డీఐజీ, డిప్యూటీ కమాండెంట్ వెంటనే స్పందించేవారు. వారి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయి. అయితే ఘటన సమయంలో వారు ఎలాంటి కాల్పులు జరపలేదు. అంతేగాక.. సమావేశం నుంచి ఎలాంటి కాల్పులు గుర్తించలేదని డిఐజీ ఎస్ ఎలాంగో ఆ తర్వాత అంగీకరించినట్లు దర్యాప్తులో తేలింది’ అని ప్రభుత్వానికి అందించిన నివేదికలో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే భద్రతాసిబ్బంది తమ పొరబాటుతోనో, కంగారుతోనో ఎన్కౌంటర్ జరిపినట్లు అర్థమవుతోందని నివేదికలో వెల్లడైంది. అంతేగాక.. వారు మావోయిస్టులని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు కూడా భద్రతాసిబ్బంది వద్ద లేవని పేర్కొంది. చాలా దగ్గర్నుంచి వీరిని కాల్చినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు ఈ నివేదిక మీడియాకు లీకవడం వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై భాజపా విమర్శలకు దిగింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అరలీటర్ వాటర్ బాటిల్ రూ.60 ఇదేం న్యాయం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- పునర్నవికి ఝలక్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
- దర్శకుల్ని ఎంపిక చేయడమే కష్టమైంది
- సౌదీలో ఇక రెస్టారెంట్లలో ఒకే క్యూ..
- సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో...
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
- మరోసారి వండర్ ఉమెన్ సాహసాలు చూశారా?
- శ్వేతసౌధంలో ఏకాకి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
