close

తాజా వార్తలు

తప్పనిసరై లిప్‌లాక్‌కు అంగీకరించా!

నికిషా పటేల్‌

కోడంబాక్కం: ‘ఎన్నమో ఏదో’ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి నికిషాపటేల్‌. ఆ తర్వాత ‘నారదన్‌’, ‘భాస్కర్‌ ఒరు రాస్కెల్‌’, ‘ఆయిరం జన్మంగల్‌’ చిత్రాల్లో నటించింది. ఇంకా తమిళం, కన్నడ భాషల్లో కూడా పలు సినిమాలు చేస్తోంది. తాజాగా ఆరవ్‌కు జోడీగా ‘మార్కెట్‌రాజా ఎంబీబీఎస్‌’లో నటిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఓ పాటను కూడా తెరకెక్కించారు. ఓ లిప్‌లాక్‌ సన్నివేశాన్ని దర్శకుడు ఇటీవల వివరిస్తే ఆరంభంలో నికిషాపటేల్‌ నిరాకరించింది. ఆ తర్వాత ఆ సన్నివేశం ప్రాముఖ్యత గురించి దర్శకుడు చెప్పడంతో వెంటనే అంగీకారం తెలిసింది. ఆ మేరకు సన్నివేశంలో నటించింది కూడా. దీని గురించి నికిషా స్పందిస్తూ... ‘‘ సినిమాలో చాలా ముఖ్యమైన సన్నివేశం అది. అందువల్లే అంగీకరించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ సన్నివేశాన్ని చూసేటప్పుడు ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా ఉండదు. సినిమాలపై ఉన్న ఆసక్తితోనే ఇక్కడి వచ్ఛా మంచి నాయికగా గుర్తింపు తెచ్చుకునేంత వరకు ప్రయత్నిస్తుంటా. తప్పకుండా ఏదో ఒక రోజు నేను అనుకునే గుర్తింపు వస్తుందని’’ పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.