Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144073
            [news_title_telugu_html] => 

తండ్రిని ముక్కలుగా నరికి.. బకెట్లలో ఉంచి..

[news_title_telugu] => తండ్రిని ముక్కలుగా నరికి.. బకెట్లలో ఉంచి.. [news_title_english] => Son killing his father by cutting into pieces [news_short_description] => మద్యానికి బానిసైన తండ్రి వేధింపులు తట్టుకోలేక ఓ కుమారుడు తండ్రిని ముక్కలుగా నరికి అతికిరాతకంగా హత్య చేసిన దారుణ [news_tags_keywords] => Malkajgiri,Ts News,Crime [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 00:25:48 [news_isactive] => 1 [news_status] => 2 ) )
తండ్రిని ముక్కలుగా నరికి.. బకెట్లలో ఉంచి.. - Son killing his father by cutting into pieces - EENADU
close

తాజా వార్తలు

తండ్రిని ముక్కలుగా నరికి.. బకెట్లలో ఉంచి..

మల్కాజ్‌గిరి: మద్యానికి బానిసైన తండ్రి వేధింపులు తట్టుకోలేక ఓ కుమారుడు తండ్రిని ముక్కలుగా నరికి అతికిరాతకంగా హత్య చేసిన దారుణ సంఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఇది మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో చోటుచేసుకుంది. మల్కాజ్‌గిరి ఏసీపీ సందీప్‌, సీఐ మన్మోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కృష్ణానగర్‌కి చెందిన మారుతీ కిషన్‌ సుతార్‌(80) రైల్వే శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు నలుగురు సంతానం. వారిలో ఒకరు ఇంటి నుంచి పారిపోగా, ఒక కూతురి వివాహం చేశారు. ప్రస్తుతం ఇంటి వద్ద తన భార్య, చిన్న కూతురు, చిన్న కూమారుడితో కలసి ఉంటున్నారు. ఇంటి పెద్ద అయిన మారుతీ కిషన్‌ గత కొంతకాలంగా మద్యానికి బానిసై కుటుంబసభ్యులను వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులు ఎక్కువ కావడంతో అతడిని హత్య చేయాలని చిన్న కుమారుడు నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఈ నెల 16వ తేదీ రాత్రి తండ్రిని అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఇంట్లోనే ఆరు బకెట్లల్లో ఉంచాడు. కుటుంబసభ్యుల ఎదుటే ఈ హత్య జరిగినా వారు అతడిని వారించలేకపోయారని తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కిరాతకంగా చంపడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.