close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పూర్తి ఆరోగ్యంతో సీఎం

 యశోదా ఆసుపత్రిలో పరీక్షలు
 కరోనా లక్షణాలు లేవు
 వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా లక్షణాలు తగ్గిపోయి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. సీఎంకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించామని, సీటీ స్కానింగ్‌ చేశామని, అంతా సాధారణంగానే ఉందన్నారు. ఊపిరితిత్తులకు ఎటువంటి ఇన్ఫెక్షన్‌ లేదని, ఆక్సిజన్‌ స్థాయులు సైతం బాగానే ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ఆయన విధులకు హాజరయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఎంవీ రావు, ఇతర వైద్యుల బృందం సూచనల మేరకు సీఎం బుధవారం సాయంత్రం వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి వచ్చారు.  ఆయన వెంట మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌ తదితరులున్నారు. వైద్యుల బృందం ముఖ్యమంత్రికి 40 నిమిషాల పాటు సీటీ స్కాన్‌, ఎక్స్‌రే, కాలేయం పనితీరు పరీక్ష (ఎల్‌ఎఫ్‌టీ), సీరియాక్టివ్‌ ప్రోటీన్‌ (సీఆర్‌పీ), డీ డైమర్‌, ఐఎల్‌6 తదితర పరీక్షలు చేశారు. రక్త పరీక్షల నిమిత్తం నమూనాలను సేకరించారు. అనంతరం కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రానికి బయల్దేరి వెళ్లారు.
ఎంవీ రావు మాట్లాడుతూ, సీఎం ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. రక్తపరీక్షల ఫలితాలు గురువారం వస్తాయని చెప్పారు. సీఎం రాక సందర్భంగా యశోదా ఆసుపత్రి వద్దకు పలువురు మంత్రులు, నేతలు వచ్చారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు