ప్రపంచ వారసత్వ హోదాకు చేరువగా రామప్ప

ప్రధానాంశాలు

ప్రపంచ వారసత్వ హోదాకు చేరువగా రామప్ప

  25న ఎంపిక కమిటీ తుది సమావేశం

పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని చారిత్రక రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకునేందుకు చేరువైందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ఈ నెల 25న పారిస్‌లో ఎంపిక కమిటీ తుది సమావేశం జరుగుతుందని తెలిపారు. భారత్‌ తరఫున వినతులను పరిశీలిస్తుందని చెప్పారు. తర్వాత నిర్ణయం ప్రకటిస్తుందని వివరించారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రామప్ప’కు సంబంధించిన సమస్త వివరాలను ఇప్పటికే యునెస్కోలోని భారత శాశ్వత ప్రతినిధికి పంపామన్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాన్ని, బ్రోచర్‌లను అందజేశామని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని