కొత్తగా 455 కొవిడ్‌ కేసులు

ప్రధానాంశాలు

కొత్తగా 455 కొవిడ్‌ కేసులు

మరో 3 మరణాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 455 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,45,406కు పెరిగింది. మహమ్మారి బారినపడి మరో 3 మరణాలు సంభవించగా.. ఇప్పటి వరకూ 3,805 మంది కన్నుమూశారు. తాజాగా మరో 648 మంది కరోనాకు చికిత్స పొంది కోలుకోగా.. మొత్తంగా 6,32,728 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 1న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు ఆదివారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,873 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. 1,374 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. రాష్ట్రంలో మరో 1,46,621 కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేశారు. దీంతో మొత్తంగా ఇప్పటి వరకూ 1,12,48,744 మంది తొలిడోసును, 34,82,754 మంది రెండో డోసును స్వీకరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని