TS News: ఆ విమానం మనకు వస్తుందా!.. తెలంగాణ ప్రభుత్వం ఆశలు

ప్రధానాంశాలు

TS News: ఆ విమానం మనకు వస్తుందా!.. తెలంగాణ ప్రభుత్వం ఆశలు

కేంద్రం నిర్ణయమే కీలకం

ఈనాడు, హైదరాబాద్‌: అధునాతన సీ295 సైనిక విమానాల తయారీకి మన రాష్ట్రం కేంద్రం అయ్యే అవకాశం లభించనుందా.. వేల మందికి ఉపాధితో పాటు.. ఇతరత్రా లబ్ధి కలుగుతుందా అన్న విషయమై తెలంగాణ ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాల్లో ఆశలు, అంచనాలు మొదలయ్యాయి. సీ295 విమానాల కొనుగోలుకు రూ.21 వేల కోట్లతో రక్షణ శాఖ ఎయిర్‌బస్‌ సంస్థతో శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ తయారీ అవకాశం రాష్ట్రానికి వచ్చేది లేనిదీ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కేంద్రంతో ఒప్పందం ప్రకారం ఎయిర్‌బస్‌ సంస్థ 16 విమానాలను స్పెయిన్‌లో తయారు చేయనుండగా... మిగిలిన 40 విమానాలను టీఏఎస్‌ఎల్‌ (టాటా అడ్వాన్డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌)లో ఉత్పత్తి చేయిస్తుంది. ఈ సంస్థ ప్రధాన ఉత్పత్తి కేంద్రం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉంది.  ఇటీవల డ్రోన్ల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వచ్చినప్పుడు వైమానిక కారిడార్ల గురించి మంత్రి కేటీఆర్‌ అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో సీ295 విమానాల తయారీ ప్రాజెక్టులో తెలంగాణకు అవకాశం రావడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌లోని టీఏఎస్‌ఎల్‌కు దక్కాలని ఆశిస్తున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని