close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఐపీఎల్‌ 2021 నిరవధిక వాయిదా

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్నా బయో బబుల్‌లో మ్యాచ్‌లతో అభిమానులను అలరించిన ఐపీఎల్‌ 2021 అర్ధంతరంగా ముగిసింది. గత కొన్ని రోజుల్లో అనేక మంది క్రికెటర్లు కొవిడ్‌-19 బారిన పడడంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది. మిగతా టోర్నీని తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పలేదు. ఏప్రిల్‌ 9న మొదలైన ఐపీఎల్‌లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు జరిగాయి. పాజిటివ్‌ కేసులు రాకముందే కొంత మంది ఆటగాళ్లు ఐపీఎల్‌ నుంచి వెళ్లిపోయారు. కొవిడ్‌-19 కారణంగా 2020 ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించారు.

ఖేల్‌ ఖతం


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు