24 గంటల్లో 55 వేల కేసులు.. 579 మరణాలు

తాజా వార్తలు

Published : 19/10/2020 10:08 IST

24 గంటల్లో 55 వేల కేసులు.. 579 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం 8,59,786 నమూనాలను పరీక్షించగా 55,722 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 75,50,273కు చేరింది. గడిచిన 24 గంటల్లో 579 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,14,610గా నిలిచింది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 66,63,608 మంది కోలుకున్నట్లు  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 7,72,055 క్రియాశీల కేసులు ఉన్నట్లు తెలిపింది. 

గత కొన్ని రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. వరుసగా 16వ రోజు కొత్త కేసుల కంటే కోలుకొని ఇంటికి వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రికవరీల రేటూ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 88.26 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం నమోదైన కేసుల్లో కేవలం 10.23 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని