చెన్నైలో భారీ వర్షం: విమానాలు రద్దు

తాజా వార్తలు

Updated : 25/11/2020 16:21 IST

చెన్నైలో భారీ వర్షం: విమానాలు రద్దు

చెన్నై: నివర్‌ తుపాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నైలో బుధవారం భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షం దాటికి కొన్ని చోట్ల వృక్షాలు కూలిపోయాయి. తుపాను కారణంగా చెన్నై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు నిలిపివేశారు. 26 విమానాలను రద్దు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వర్షం వల్ల చెన్నైలోని చెంబరాంబక్కం సరస్సులో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో రిజర్వాయర్‌ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ రిజర్వాయర్‌ గేట్లు తెరవడం గమనార్హం. ఇక తమిళనాడు వ్యాప్తంగా నేడు సెలవు ప్రకటించారు. రేపు కూడా 13 జిల్లాల పరిధిలో సెలవు ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మరోవైపు ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 24వేల మందికి పైగా ప్రజలను శిబిరాలకు తరలించారు. 

అటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి కూడా అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి తెలిపారు. మత్స్యకారులు సముద్రవేటకు వెళ్లొద్దని సీఎం హెచ్చరించారు. తుపాను దృష్ట్యా ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, ముంపు వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పుదుచ్చేరీ గవర్నర్‌ కిరణ్‌ బేడీ ట్విటర్‌ వేదికగా ప్రజలను కోరారు. 

ప్రస్తుతం తమిళనాడులోని కడలూరుకు 290 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన నివర్‌ తుపాను రానున్న 12 గంటల్లో పెను తుపానుగా బలపడనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ రాత్రి లేదా గురువారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశమున్నట్లు తెలిపింది. దీంతో రానున్న రెండు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. తీవ్రత ఎక్కువ ఉన్నందున పుదుచ్చేరి, తమిళనాడులో భారీ నష్టం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇళ్లు ధ్వంసమై, వృక్షాలు నేలమట్టమయ్యే ప్రమాదముందని పేర్కొంది. పెను గాలులు, భారీ వర్షాల వల్ల పంటలు కూడా దెబ్బతినే అవకాశముందని హెచ్చరించింది. ఇటు ఆంధప్రదేశ్‌లోనూ తుపాను ప్రభావం కన్పిస్తోంది. రాష్ట్రంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని