China: లద్దాఖ్‌ వద్దకు హెచ్‌-20 బాంబర్లు..!
close

తాజా వార్తలు

Updated : 14/06/2021 23:08 IST

China: లద్దాఖ్‌ వద్దకు హెచ్‌-20 బాంబర్లు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: లద్దాఖ్‌ వద్దకు అత్యాధునిక ఆయుధాల తరలింపును చైనా ఏ మాత్రం ఆపలేదు. తాజాగా స్టెల్త్‌ యుద్ధవిమానం షియాన్‌ హెచ్‌-20 స్ట్రాటజిక్‌ బాంబర్లను సరిహద్దుల్లోని హోటన్‌ విమానాశ్రయం వద్దకు తరలించింది. ఇది లద్దాఖ్‌కు అత్యంత సమీపంలో ఉంది. భారత్‌ రఫేల్‌ జెట్‌ విమానాలను లద్దాఖ్‌ వద్ద వినియోగిస్తుండటంతో.. వ్యూహాత్మక ఆధిపత్యం కోసం చైనా షియాన్‌ హెచ్‌-20 ఫైటర్‌ జెట్‌లను మోహరించింది. జూన్‌ 8వ తేదీ నుంచి వీటి సామర్థ్యాన్ని పరీక్షించడం మొదలుపెట్టింది. 22వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. అదే రోజుకు చైనా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తవుతుంది.

ఈ విమానాలు భారీ పేలోడ్‌తో సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడులు చేయగలవు. భారత రాడార్ల కన్నుగప్పగలవని చైనా చెబుతోంది. చైనా వీటిని సైన్యంలోకి తీసుకొన్నప్పుడు భారీగా ప్రచారం చేసింది. ఇది నిర్ణాయకమైన ఆయుధమని పేర్కొంది. అమెరికా, రష్యా తర్వాత ఇటువంటి టెక్నాలజీ ఉన్న దేశంగా చైనా నిలిచింది.

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖకు అటువైపుగా కొద్ది రోజుల క్రితం చైనా యుద్ధ విన్యాసాలు చేపట్టింది. జె-11, జె-16 సహా పలు అధునాతన యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి  వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న హోటన్‌, గార్‌ గున్సా, కాష్గర్‌ వైమానిక స్థావరాల నుంచి డ్రాగన్‌ ఈ విన్యాసాలు చేపట్టింది. వీటిని చైనా ఇటీవల అప్‌గ్రేడ్‌ చేసింది. అన్ని రకాల యుద్ధ విమానాలు ఇక్కడ ల్యాండ్‌ అయ్యేలా తీర్చిదిద్దింది. అయితే ఈ డ్రిల్స్‌ సమయంలో చైనా యుద్ధ విమానాలు తమ గగనతలంలోనే ఉన్నాయని రక్షణశాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

పీఎల్‌ఏ ఆధునీకరించిన రాకెట్‌ లాంఛర్లను భారత సరిహద్దులకు తరలించినట్లు చైనాకు చెందిన సీసీటీవీ గతంలో కథనం ప్రచురించింది. దీనికి సంబంధించిన చిత్రాలను కూడా విడుదల చేసింది.  పీహెచ్‌ఎల్‌ 03 రాకెట్‌ లాంఛర్లు, భారీ ఎత్తున శతఘ్నులను షిన్‌జియాంగ్‌ మిలటరీ కమాండ్‌లో మోహరించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం టిబెట్‌లోని 5,200 మీటర్ల ఎత్తులో ఈ దళం మోహరించింది.

గత జూన్‌లో భారత్‌తో ఘర్షణ జరిగిన ప్రాంతానికి ఇది సమీపంలో ఉండటం గమనార్హం. సాధారణంగా రాకెట్‌ లాంఛర్లను మోహరించాలంటే ముందస్తు వ్యూహం ఉండాలి. తాము లక్ష్యంగా పెట్టుకొన్న ప్రదేశంలో వేగంగా పైచేయి సాధించేందుకు రాకెట్‌ దాడులను నిర్వహించి.. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఈ లాంఛర్‌ నుంచి ఒక్కోటి 800 కిలోల బరువున్న12 రాకెట్లను ప్రయోగించవచ్చు. వీటి ద్వారా దాదాపు 130 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించవచ్చు. 8 చక్రాలు అమర్చిన ట్రక్కుపై దీనిని గంటకు 60 కిలోమీటర్ల వేగంతో తరలించేలా ఏర్పాట్లు చేశారు.  ఈ రాకెట్‌ లాంఛర్‌ను కేవలం 3 నిమిషాల్లోనే  పోరాటానికి సిద్ధం చేయవచ్చు. ఈ రాకెట్లు చైనా ప్రయోగించిన బైడూ శాటిలైట్‌ వ్యవస్థ ఆధారంగా లక్ష్యాల వైపు ప్రయాణిస్తాయి. ఒకే సమయంలో ఎక్కువ లక్ష్యాలపై దాడి చేయడానికి అవకాశం లభిస్తుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని