గంగానదిలో మళ్లీ శవాల కలకలం!
close

తాజా వార్తలు

Updated : 15/05/2021 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గంగానదిలో మళ్లీ శవాల కలకలం!

నది పిలుస్తోందని చెప్పి.. విలపించేలా చేస్తున్నారంటూ రాహుల్‌ విమర్శలు 

ఘాజీపూర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ ఘాజీపూర్‌లోని గంగానదిలో మరోసారి పెద్ద సంఖ్యలో మృతదేహాలు కనిపించాయి. అయితే, ఇవి కొవిడ్‌ మృతదేహాలా? కాదా? అనే విషయాన్ని మాత్రం అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఈ ఉదయం మృతదేహాలు నదిలో కొట్టుకు రాగా.. దూరంగా ఉన్న ఇసుక దిబ్బల్లో స్థానికులు వీటిని గుర్తించారు. ఇటీవల గంగా నదిలో కొవిడ్‌ మృతదేహాలను ఖననం చేస్తున్నట్టు వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భౌతికకాయాలు కనిపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. 

ప్రధానిపై రాహుల్‌ పరోక్ష విమర్శలు
అయితే, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పరోక్ష విమర్శలు చేశారు. గంగా నది పిలస్తోందని వ్యాఖ్యలు చేసిన వారే ఇప్పుడు నదిని విలపించేలా చేస్తున్నారంటూ పేర్కొన్నారు. గంగానదిలో శవాలు కొట్టుకురావడంపై ఈ మేరకు ట్విటర్‌లో విమర్శించారు. 1140 కి.మీల పొడవైన గంగానది తీరప్రాంతంలో ఇప్పటివరకు 2వేలకు పైగా శవాలను గుర్తించినట్టు పేర్కొన్న ఓ వార్తను రాహుల్‌ తన ట్వీట్‌కు జతచేశారు. కొద్ది రోజులుగా ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లలోని గంగానదీ పరివాహక ప్రాంతాల్లో అనేక శవాలను అధికారులు గుర్తించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని