11,240 అడుగుల ఎత్తు నుంచి జారి పడి...

తాజా వార్తలు

Published : 03/01/2020 16:31 IST

11,240 అడుగుల ఎత్తు నుంచి జారి పడి...

వాషింగ్టన్‌: కెనడాకు చెందిన 16 ఏళ్ల గుర్బాజ్‌ సింగ్ అనే భారత సంతతి పర్వతారోహకుడు అమెరికాలోని మౌంట్ హుడ్ అనే పర్వతం నుంచి జారిపడ్డాడు. అయితే అదృష్టవశాత్తు అతడు ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. మంగళవారం మిత్రులతో కలిసి గుర్బాజ్‌ తన 90వ పర్వతారోహణలో భాగంగా అమెరికాలోని 11,240 అడుగుల ఎత్తయిన మౌంట్ హుడ్ పర్వతాన్ని అధిరోహిస్తున్నాడు. ఈ క్రమంలో మంచులో పట్టుతప్పి 500 అడుగులకు జారి పడినట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో అతడి కాలికి గాయమైంది. దీని గురించి సమాచారం అందుకున్న వెంటనే రక్షణ బృందాలు రంగంలోకి దిగి 10,500 అడుగుల ఎత్తులో చిక్కుకున్న అతణ్ని క్షేమంగా బయటికి తీసుకువచ్చాయి.

హెల్మెట్ ధరించటం, అద్భుతమైన శిక్షణ వల్లే గుర్బాజ్‌ గాయాలతో తప్పించుకోగలిగాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ‘‘నేను ఎంతో అదృష్టవంతుణ్ని. నా హెల్మెట్‌ నన్ను ప్రమాదం నుంచి కాపాడింది’’ అని గుర్బాజ్‌ అన్నాడు. ఈ ఘటనపై గుర్బాజ్‌ తండ్రి రిషమ్‌దీప్‌ సింగ్ స్పందించారు. ‘‘మంచు కారంణంగా గుర్జాజ్‌ ఇబ్బందిపడ్డాడు. జారిపడుతున్న సమయంలో తన వద్దనున్న గొడ్డలి సహాయంతో తన వేగాన్ని నియంత్రిచుకోవాలని ప్రయత్నించినప్పటికి అది సాధ్యపడలేదు. గాయం నుంచి కోలుకున్న వెంటనే తిరిగి మరోసారి పర్వతాన్ని అధిరోహిస్తాడు’’ అని ఆయన తెలిపారు. మౌంట్ హుడ్ పర్వతం అమెరికాలోని ఒరెగాన్‌లోనే ఎత్తయిన పర్వతం. ఏటా దీన్ని 10,000 మందికి పైగా సందర్శిస్తారని అమెరికా ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని