Goat milk: మేక పాలు లీటర్‌ రూ.400!

తాజా వార్తలు

Published : 23/10/2021 12:45 IST

Goat milk: మేక పాలు లీటర్‌ రూ.400!

మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పుర్‌ జిల్లాలో ఇటీవల మేక పాలకు డిమాండ్‌ అమాంతం పెరిగింది. దీంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రూ. 30 నుంచి 40 మధ్య లభించే లీటర్‌ పాలు ఇప్పుడు రూ.300 నుంచి 400కి చేరుకున్నాయి. ఈ స్థాయిలో ధరలు పెరగడం వెనుక కారణం ఏంటో తెలుసుకుందాం.. రాష్ట్రంలో డెంగీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అందులోనూ ఛత్తర్‌పుర్‌ సహా సమీప జిల్లాల్లో వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉంది. మేక పాలు తాగితే డెంగీ నయం అవుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాలకు డిమాండ్‌ పెరిగింది. ఈ పరిస్థితిపై స్థానిక డాక్టర్లు స్పందించారు. మేక పాలు తాగడం డెంగీ రోగులకు ఉపయోగమే కానీ.. దాని వల్ల జబ్బు నయం కాదని, అది కేవలం అపోహ అని తెలిపారు.    


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని