NIC: ప్రభుత్వ ఈ-మెయిల్‌ వ్యవస్థ సురక్షితం!
close

తాజా వార్తలు

Published : 13/06/2021 22:36 IST

NIC: ప్రభుత్వ ఈ-మెయిల్‌ వ్యవస్థ సురక్షితం!

హ్యాకర్ల దాడుల నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ క్లారిటీ

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఈ-మెయిల్స్‌కు సైబర్‌ దాడుల నుంచి ఎటువంటి ముప్పూ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ముఖ్యంగా నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (NIC) పర్యవేక్షించే ఈ-మెయిల్‌ వ్యవస్థ సురక్షితంగా ఉందని ప్రకటించింది. వందల సంఖ్యలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన ఈ-మెయిల్స్‌, పాస్‌వర్డులు హ్యాకర్ల బారినపడినట్లు వచ్చిన వార్తలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం, ఈ క్లారిటీ ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ-మెయిల్‌ వ్యవస్థ అత్యంత సురక్షితమైనదని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. ముఖ్యంగా ఇతర వెబ్‌సైట్లపై జరిగే సైబర్‌ దాడులు ప్రభుత్వ ఈ-మెయిల్‌ వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని స్పష్టం చేసింది. ఆయా వెబ్‌సైట్లలో నమోదు చేసుకున్న ఈ-మెయిల్‌, ప్రభుత్వ ఈ-మెయిల్‌ అకౌంటుల పాస్‌వర్డులు ఒకటే అయినప్పుడు మాత్రమే ప్రభావం చూపించడానికి ఆస్కారం ఉంటుందని తెలిపింది. అయితే, ఇలాంటి దాడులకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించడంతో పాటు ఎప్పటికప్పుడు పాస్‌వర్డులు మార్చుకునేలా ఈ-మెయిల్‌ వ్యవస్థ రూపొందించామని పేర్కొంది. అందువల్ల ఈ మధ్య జరిగిన సైబర్‌ దాడులతో ప్రభుత్వ ఈ-మెయిల్స్‌ వ్యవస్థకు ఎటువంటి ప్రమాదం లేదని తెలిపింది.

గత నెలలో ‘ఎయిర్‌ ఇండియా’పై చైనా హ్యాకర్లు సైబర్‌దాడికి పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 45 లక్షల మంది ప్రయాణికుల వివరాలను హ్యాకర్లు తస్కరించినట్లు సమాచారం. ముఖ్యంగా పాస్‌పోర్టు వివరాలు, క్రెడిట్‌కార్డుల సమాచారం వంటివి ఉన్నాయి. అయితే, వీరిలో కేంద్ర ప్రభుత్వ అధికారుల వివరాలు కూడా ఉన్నాయనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీశాఖ ఈ క్లారిటీ ఇచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని