ఫీల్డ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేయండి: కేంద్రం
close

తాజా వార్తలు

Updated : 24/04/2021 19:29 IST

ఫీల్డ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేయండి: కేంద్రం

దిల్లీ: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారందరికీ మే 1 నుంచి కరోనా టీకాలు ఇచ్చేందుకు కేంద్రం సమాయత్తమవుతున్న తరుణంలో అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ రీసెర్చ్‌ సంస్థల సాయంతో వీలైనన్ని ఫీల్డ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే కేంద్ర సహాయం కూడా తీసుకోవాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌) సేవలనూ వినియోగించుకోవచ్చని చెప్పింది. అన్ని రాష్ట్రాలూ వీలైనన్ని ప్రైవేటు వ్యాక్సినేషన్‌ సెంటర్లకు కూడా అనుమతి ఇవ్వాలని కోరింది. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు తగిన భృతి ఇవ్వాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. 

కొవిడ్‌ వ్యాక్సిన్లు ఇస్తున్న ఆస్పత్రులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని, అధిక ధరలకు వ్యాక్సిన్లు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది. 18 -45 ఏళ్ల మధ్య వయస్సువాళ్లు కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకునేలా అవగాహన కల్పించాలని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఐసోలేషన్‌ కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరింది. దీనివల్ల చిన్నపాటి లక్షణాలు కనిపించిన బాధితులు, సాయం చేసేందుకు ఇంట్లో ఎవరూ లేని బాధితులకు మేలు జరుగుతుందని కేంద్రం అభిప్రాయపడింది.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఏర్పాటు చేసిన కొవిన్‌ పోర్టల్‌ ప్రస్తుతం బాగానే పని చేస్తోందని, రిజిస్ట్రేషన్ల సమయంలో లోడును తట్టుకునేలా దీనిని రూపొందించామని కొవిడ్‌ 19 టెక్నాలజీ అండ్‌ డేటా మేనేజ్‌మెంట్‌ సాధికార గ్రూప్‌ ఛైర్మన్‌ డా.ఆర్‌ఎస్‌ శర్మ వెల్లడించారు. కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే నమోదు చేయాలని, లేదంటే మొత్తం పోర్టల్‌పైనే దీని ప్రభావం పడే అవకాశముందని ఆయన అన్నారు. గత కొన్ని రోజులుగా కొవిడ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చాలా మంది బాధితులు ఊపిరాడక సతమతమవుతున్నారు. సరైన సమయంలో ఆక్సిజన్‌ లభించక పోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడటంతో.. ఓవైపు దేశీయ ప్లాంట్ల ఉత్పత్తి సమార్థ్యాన్ని పెంచుతూనే.. సింగపూర్‌ లాంటి దేశాల నుంచి ఆక్సిజన్‌ను తెప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని