Lok sabha: బీమా చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

తాజా వార్తలు

Published : 02/08/2021 23:05 IST

Lok sabha: బీమా చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

దిల్లీ: బీమా రంగంలో ప్రభుత్వ వాటాలను తగ్గించుకుని ఎఫ్‌డీఐలను పెంచుకునేందుకు వీలుగా ఈ తీసుకొచ్చిన బీమా చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ సవరణ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సోమవారం దీనికి దిగువ సభ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభలోనూ ఆమోదం పొందితే రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి కూడా ఆమోదిస్తే ఈ బిల్లు చట్టంగా మారుతుంది. 

రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థను ప్రైవేటీకరణ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-22 బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74 శాతానికి పెంచుకొనేలా సంబంధిత చట్టానికి సవరణలు తీసుకొస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్‌ చట్టం - 1938కి పలు సవరణలు చేయగా.. ఈ ఏడాది మార్చిలో కేంద్ర మంత్రివర్గం వీటికి ఆమోదం తెలిపింది. తాజాగా లోక్‌సభ కూడా ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత చట్ట నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో 51శాతానికి తగ్గకుండా ఉండాలి. అయితే తాజా చట్టంతో ఈ వాటాలను కేంద్రం తగ్గించుకునే వీలు లభిస్తుంది.  

ప్రస్తుతం దేశంలో నాలుగు సాధారణ బీమా సంస్థలున్నాయి. అవి.. నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీ లిమిడెట్‌, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌. అయితే వీటిల్లో దేన్ని ప్రైవేటీకరించనున్న విషయాన్ని కేంద్రం ఇంకా వెల్లడించలేదు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని