close

తాజా వార్తలు

Published : 19/04/2021 23:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్లీలో ఒక్కరోజే 240 మంది మృతి

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకీ కొవిడ్‌ బారినపడుతున్న బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 23,686 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,  240 మంది మృత్యువాత పడినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలో ఆరు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌ సోమవారం రాత్రి 10 గంటల నుంచి మొదలై వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకూ అమల్లో ఉండనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని